Balakrishna & Kalyan Ram Special Interview on NTR Kathanayakudu | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-07

Views 5.3K

NTR Kathanayakudu is the latest film of actor Balakrishna and host of other celebs. In an interview both actors Balakrishna and Kalyan Ram have opened up about the film and about playing their roles in the biopic movie.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం జనవరి 9న విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్రనికి కళ్ళకు కట్టినట్లు వెండితెరపై ఆవిష్కరించాలని బాలయ్య గట్టి ప్రయత్నం చేశారు. భారీ బడ్జెట్ లో, స్టార్ కాస్టింగ్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. క్రిష్ దర్శత్వంలో ఈ చిత్రం రూపొందడం విశేషం. ముందుగా ఎన్టీఆర్ సినీరంగానికి సంబందించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో తన తండ్రి హరికృష్ణ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ నా లుక్ సెట్ చేసిన చాలా మంది ఫోటోలు చూసి నాన్నగారిలాగే ఉన్నానని అన్నారు. కానీ నాకు మాత్రం నమ్మకం కుదర్లేదు. నేను సాధారణంగానే నాన్నగారిలా ఉండను. ఆయన లావుగా ఉంటారు. ఆయనది ఉంగరాల జుట్టు. అప్పటికి ఎంతో కష్టపడి 10 కేజీలుపెరిగా. ఇంకో 20 కేజీలు లావు పెరిగితే కానీ ఆయనలా కనిపించను అని కళ్యాణ్ రామ్ తెలిపాడు.
#NTRKathanayakudu
#Balakrishna
#KalyanRam
#ntrbiopic
#NTRBiopicTeamInterview

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS