The Indian captain had a much more classy reply ready for the Australian fans. One of the world’s best batsman doffed his cap and bowed to the fans.
మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఆతిథ్య జట్టు అభిమానులు భారత క్రికెటర్లను ఉద్దేశించి జాతి విద్వేష నినాదాలు చేశారు. ఆటలో భాగంగా మూడో రోజైన శుక్రవారం భారత క్రికెటర్లను ఉద్దేశించి మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లోని కొందరు అభిమానులు జాతి వివక్షకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో "మీ వీసాలు చూపించండి" అంటూ ఆసీస్ అభిమానులు పెద్దగా నినాదాలు చేశారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా రంగంలోకి దిగి సదరు అభిమానులకు వార్నింగ్ కూడా ఇచ్చింది. మరోసారి ఇలా చేస్తే శిక్ష తప్పదని పేర్కొంది. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని "పనికిరాని వ్యక్తి" అంటూ నినాదాలు చేశారు. దీనిపై కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు.
#IndiavsAustralia2018
#ViratKohli
#3rdTest
#JaspritBumrah
#Pujara
#MayankAgarwal
#hanumavihari
#MuraliVijay
#RohitSharma
#PatCummins
#Melbourne