nganaElections2018
#RevanthReddy
#RevanthReddyarrest
#kcr
#trs
#Kodangal
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెల్లవారుజామున పోలీసులు ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొడంగల్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈక్రమంలో రేవంత్ రెడ్డి సతీమణి గీత సైతం పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తీరు సరికాదని మండిపడ్డారు గీత. తామేమైనా తీవ్రవాదులమా అంటూ ఉద్వేగానికి గురయ్యారు.
రేవంత్ రెడ్డిపై పోలీసులు అనుసరిస్తున్న తీరు సరికాదన్నారు ఆయన సతీమణి గీత. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో, ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు తమ కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఆమె తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ తో కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. ఎవరూ ఎంత రెచ్చగొట్టాలని చూసినా సంయమనం పాటించాలని.. ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఇదంతా కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడిగా ఆమె అభిప్రాయపడ్డారు. నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.