Janhvi Kapoor Reveals One Male Actor She Would Like To Wake Up As. Hint: He’s Not From Bollywood

Filmibeat Telugu 2018-11-26

Views 1

Janhvi Kapoor reveals one male actor she would like to wake up as. Janhvi Kapoor would like to wake up as Telugu actor Vijay Deverakonda, she revealed in the latest episode of Koffee With Karan 6
#VijayDeverakonda
#JanhviKapoor
#taxiwala
#dearcomred
#dhadak
#ishaan khattar
#tollywood


శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ తన డెబ్యూ మూవీతో ఆకట్టుకుంది. ఇషాన్ ఖట్టర్ తో జంటగా నటించిన దఢక్ చిత్రంతో జాన్వీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లుక్, నటన పరంగా జాన్వీ సినీ విమర్శకులని, ప్రేక్షకులని మెప్పించింది. ప్రస్తుతం జాన్వీ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షో బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారు. ఇటీవల అర్జున్ కపూర్, జాన్వీ కాఫీ విత్ కరణ్ షోకు గెస్ట్ లుగా హాజరయ్యారు.
ఈ షోలో రాపిడ్ ఫైర్ లో భాగంగా కరణ్ జోహార్.. జాన్విని ఓ ప్రశ్న అడిగారు. ఒక రోజు ఉదయం నిద్రలేవగానే పురుషుడిగా మారిపోవాలంటే ఏ నటుడ్ని ఎంచుకుంటావు అని అడిగాడు. దీనికి జాన్వీ కపూర్ తడుముకోకుండా.. విజయ్ దేవరకొండ అంటూ సమాధానం ఇచ్చింది. అంతే కాదు తనతో సినిమా చేయాలనే కోరికని కూడా బయట పెట్టింది.

Share This Video


Download

  
Report form