chandrababu offered silk clothes to the deity at Goddess Kanaka Durga Temple, in Vijayawada today, on behalf of Andhra Pradesh (AP) government. His wife, Bhuvaneswari and daughter-in-law, Nara Bhrahmani along with her son, Devansh attended and worshipped the Mother Goddess.
#vijayawada
#chandrababu
#indrakeeladri
#kanakadurgamma
#Andrapradesh
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. కొండపైకి చేరుకున్న చంద్రబాబుకు ఆలయ పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందజేసి.. అమ్మవారి తీర్ధప్రసాదాలను స్వీకరించారు. చంద్రబాబుతో పాటూ నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్ ఉన్నారు.
ఆంధ్ర రాష్ట్రాన్ని చల్లగా చూడమని దుర్గమ్మను ప్రార్థించానన్నారు చంద్రబాబు. సకాలంలో వర్షాలు కురిపించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని కోరుకున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌తో పాటూ అన్ని నదుల అనుసంధానం జరగాలని కూడా ప్రార్ధించానన్నారు. విజయవాడను ఆధ్యాత్మిక కేంద్రంగా.. మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు సీఎం.