Saraswati Puja 2018 falls on Monday January 22. Basant Panchami 2018 is also celebrated as Saraswati Puja.Goddess Saraswati is the fountain head of all learning and art forms. Students, professionals, artists, musicians and scholars worship Maa Saraswati seeking wisdom, artistic and technical skills, academic excellence and a good heart. Vasant Panchami and Navratri are some special occasions when Saraswati puja is popularly performed. You can, however, perform Saraswati puja in your home on any day you feel.
#dussehra2018
#Saraswatipuja
#bathukamma
#BasantPanchami
#wisdom
#Navratri
మాఘశుద్దపంచమి శ్రీ పంచమి అయి ఉన్నది. పంచాంగకర్తలు ఈనాటి వివరణలో శ్రీపంచమి, మదనపంచమి, వసంత్సోవారంభః, వసంతపంచమి, రతికామ దమనోత్సవ, సరస్వతీ జయంతి అని వ్రాస్తారు. వసంతోత్సవారంభః అనే చోట కొందరు పంచాంగకర్తలు వసంతపంచమి అని ఉదాహరిస్తారు. వసంతపంచమినామాన్ని పట్టి ఇది బుతుసంబంధమైన పండుగగా భావించవలసి ఉంటుంది. మాఘఫాల్మణాలు శిశిర ఋతువు. చైత్రవైశాఖాలు వసంతఋతువు. శిశిర ఋతువు ప్రారంభంలోనే వసంత ఋతుసంబంధంగా ఈ వసంత పంచమి పర్వం చేయడానికి కారణం ఏమో తెలియటం లేదు. మకరసంక్రాతికి తరువాత ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఆ కాలంలోనే క్రమంగా వసంత ఋతులక్షణాలైన చెట్ల చిగర్చడం, పూలు పూయడం మొదలయినవి కనిపిస్తాయి. "మాఖాద్యా పంచవసణ" అనే ఉక్తి ఒకటి ఉంది. మాఘమాసమే వసంత ఋతువునకు ఆరంభమనే మతం ఒకటి ఉంది. ఆ వసంత ఋతు సూచనలకు ఈ వసంత పంచమి స్వాగతోపచారాలు చేసే పర్వంగా ఎంచుకోవలసి ఉంటుంది. రాగల వసంత ఋతువుకు శిశిర ఋతువులో చేసే స్వాగతోపచారం ఈ పండుగ.