With the Indian government talking tough on WhatsApp's failure to check the spread of fake and provocative content on its platform, the instant messaging service on Wednesday said it has begun rolling out its forward message limit to five chats for over 200 million users in India.
#whatsapp
#message
#users
#india
#Rule
#FakeMessages
తప్పుడు సమాచారం, అసత్య వార్తలు వ్యాప్తి కాకుండా కట్టడి చేసేందుకు ప్రముఖ సోషల్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ చర్యలు చేపట్టింది. ఇటీవల కాలంలో వాట్సాప్‌లో వస్తున్న వదంతుల వ్యాప్తి కారణంగా అమాయకులపై దాడులు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కూడా వాట్సాప్‌ను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో తప్పుడు వార్తలను అరికట్టేందుకు వాట్సాప్.. ఫార్వర్డ్ చేసే సందేశాలపై పరిమితి విధించింది. ఇందులో భాగంగానే ఇక నుంచి వాట్సాప్ మెసేజ్‌లు ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
బుధవారం(ఆగస్టు 8) నుంచి భారత్‌లో వాట్సాప్ వినియోగదారులకు ఇది వర్తించనుందని వాట్సాప్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.