మీడియా సంచలనం శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న కాస్టింగ్ కౌచ్ విషయంలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొందరి సినీప్రముఖులు పేర్లని మీడియా వేదికగా ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా శ్రీరెడ్డి ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నేడు ఈ పిటిషన్ విచారణకు రానుంది.
నేడు ఈ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. తానే స్వయంగా కాస్టింగ్ కౌచ్ కి బలయ్యానని శ్రీరెడ్డి తరచుగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులపై ఆరోపణలు చేసింది.
#SriReddy
#BharathiRaja
#srikanth