Srireddy comments on Allu Arjun brother Allu Bobby. All facts will leak soon says SriReddy
#Srireddy
టాలీవుడ్ లో శ్రీరెడ్డి ఎపిసోడ్ అంతు లేని కథలా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రముఖుల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన శ్రీరెడ్డి తాజగా మరో సంచలనానికి తెరతీయబోతోంది. మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ ఇలా ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబాలనే శ్రీరెడ్డి టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ సురేష్ బాబు, అల్లు అరవింద్ వంటి బడా నిర్మాతల చేతుల్లో ఉందంటూ ఆ మధ్యన శ్రీరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేరుగా వారి ఫ్యామిలిలో వ్యక్తులనే టార్గెట్ చేస్తోంది. అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.