డాన్స్ మాస్టర్, దర్శకుడు రాఘవ లారెన్స్ మీద శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమిళ మీడియా ఛానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అవకాశం ఇస్తానని చెప్పి సెక్సువల్‌గా వాడుకున్నాడని, ఈ విషయంలో తన వద్ద ప్రూఫ్స్ ఏమీ లేవని, అలాంటి సమయంలో నా బాడీలో కెమెరాలు పెట్టుకోవడం సాధ్యం కాదు కదా... అంటూ వ్యాఖ్యానించడం, దీనికి లారెన్స్ స్పందిస్తూ శ్రీరెడ్డిని చూస్తే జాలేస్తోందని, ఆమెలో టాలెంట్ ఉంటే నిరూపించుకోమనండి, నా సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూ ఛాలెంజ్ చేయడం తెలిసిందే. లారెన్స్ ఛాలెంజ్‌పై శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యారు.
రాఘవ లారెన్స్ చేసిన కామెంట్లపై శ్రీరెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ విషయాన్ని తెగే వరకు లాగక పోతే నీకే మంచిది అంటూ తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా కౌంటర్ ఇచ్చింది.