తమిళ్ లీక్స్ అంటూ కొత్త వివాదం మొదలు పెట్టిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో విహరిస్తోంది. శ్రీరెడ్డి లీక్స్ వలన తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అలజడి మొదలైంది. కాస్టింగ్ కౌచ్ పోరాటం నుంచి మొదలైన శ్రీరెడీ సంచలనాలు ఇప్పటికీ కొనసాగుతోనే ఉన్నాయి. తనకు చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటులతో పరిచయం ఉందని, వారంతా తనని వాడుకుని మోసం చేసారని శ్రీరెడ్డి చాంతాడంత లిస్ట్ బయట పెడుతోంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వారంతా మోసం చేశారా అంటూ సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై సెటైర్లు పడుతున్నాయి. ఈ ట్రోలింగ్ పై శ్రీరెడ్డి తాజాగా స్పందించింది.
శ్రీరెడ్డి గత కొని రోజులుగా తమిళ చిత్ర పరిశ్రమలోని కొందరు నటులపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. రాఘవ లారెన్స్, శ్రీకాంత్, మురుగదాస్ ఇలా కొందరు ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ తనని వాడుకుని మోసం చేసారని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది.
శ్రీరెడ్డి ఆరోపణలపై సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. ఒక వ్యక్తి ఒకరి వలనో, ఇద్దరి వలనో మోసపోవచ్చు. కానీ ఇండస్ట్రీలో ఉన్నవారందరి వలన మోసపోవడం సాధ్యమేనా అని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.