మనం పామును చూసిన వాటి పేరు చెప్పినా భయపడతాం. పాములంటే మనలో చాలా మందికి భయం ఉంటుంది. కానీ కొందరికి పాములంటే అస్సలు భయం ఉండదు. ఇక చైనా వాళ్లు అయితే పాములను అస్సలు లెక్క చెయ్యరు. వారు పాములను చాలా ఇష్టంగా తింటారు. ఇంకొందరు పాము వైన్ ను కూడా బాగా ఇష్టపడతారు.ఇక ఇరవై ఏళ్ల యువతికి పాము వైన్ తాగాలని అనిపించింది. వెంటనే ఆన్ లైన్ లో ఒక మంచి పాముని ఆర్డర్ చేసింది. కానీ దాని వల్లే ఆమె చనిపోయింది. చైనా లోని షాంగ్జీకి చెందిన క్వికీ పాము వైన్ అంటే బాగా ఇష్టం. ఆమెకే కాదు ఆ ప్రాంతంలోని చాలా మందికి పాము వైన్ అంటే బాగా ఇష్టం. చాలా మంది స్నేక్ వైన్ అంటే బాగా ఇష్టపడతారు.
జువాన్ జువాన్ అనే ఆన్ లైన్ షాపింగ్ ద్వారా ఆ అమ్మాయి ఒక పాము ను బుక్ చేసుకుంది. డెలివరీ బాయ్ పామును తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ అమ్మాయి చాలా ఆనందపడింది. ఈ రోజు స్నేక్ వైన్ తో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంది. వెంటనే వైన్ బాటిల్ తీసుకుని ఒక పాత్రలో పోసింది.