Sachin Tendulkar Responds On Dhoni Retirement

Oneindia Telugu 2018-07-23

Views 237

ధోనీ మునుపటిలా ఆడలేకపోతున్నాడు. అతని ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఇలా అయితే వన్డే ప్రపంచ కప్ టోర్నీ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టం. అంటూ పలువురు ధోనీ ఇటీవల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా కొద్ది రోజుల ముందే పరిమిత ఓవర్ల సిరీస్ పూర్తి చేసుకుంది. ఈ టీ20, వన్డే సిరీస్‌లలో ధోనీ సరిగా రాణించలేకపోయాడు.దీంతో క్రికెట్ ప్రముఖులతో పాటు, విమర్శకులు సైతం ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటిస్తే బాగుంటుంది అన్నట్లు స్పందించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సచిన్ ఇలా అన్నారు. వచ్చే ప్రపంచకప్‌కు జట్టులో ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరూ సిద్ధంగా లేరంటూ సచిన్‌ ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

MS Dhoni has been under a lot of fire in the last few days after a none-so-bright performance against England. It has also sparked the speculation that MS Dhoni may choose to retire.
#sachintendulkar
#msdhoni
#england
#india
#bcci

Share This Video


Download

  
Report form