మీ వల్ల నష్టపోతున్నాం: పవన్‌కు రైతుల ఝలక్

Oneindia Telugu 2018-07-23

Views 3

బలవంతపు భూసేకరణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. రైతులు ఇస్తేనే ప్రభుత్వం భూములు తీసుకోవాలని సూచించారు. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు భూములు ఇచ్చిన రైతులు నేటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నారని విమర్శించారు. రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకుంటే వారికి అండగా ఉండి పోరాటం చేస్తానని చెప్పారు.
గ్రామసభలు పెట్టి అందరి అనుమతితో భూములు తీసుకోవాలని సూచించారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతులకు అండగా నిలబడతానని చెప్పారు. ప్రభుత్వం బెదిరిస్తే ఎవరూ భయపడవద్దని, నేను అండగా ఉంటానని రైతులకు, గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు. మరో బషీర్‌బాగ్ చేయాలనుకుంటే పోలీసుల తూటాకు ముందు నా గుండె చూపుతానని అన్నారు.
భూములను కొద్దిమంది చేతుల్లో పెట్టడాన్ని జనసేన వ్యతిరేకిస్తుందని పవన్ చెప్పారు. అవసరానికి మించి భూములు తీసుకోవద్దన్నారు. అసైన్డ్ భూములకూ భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరానికి మించి రాజధాని కోసం భూసేకరణ జరుగుతోందన్నారు. భూసేకరణ చేస్తారని ఎన్నికలకు ముందు తెలిస్తే నేను వేరేలా ఉండేవాడినని పవన్ చెప్పారు. మద్దతిచ్చేవాడిని కాదన్నారు.

I will face police bullets, Don't afraid at Chandrababu Naidu Government, says Jana Sena chief Pawan kalyan to Undavalli farmers on Sunday.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS