Pradeep Machiraju makes a Grand Entry to the Bigg House. Bigg Boss is a Telugu reality show, aired on Star Maa. 16 people will live under one roof, for 106 days, monitored by multiple cameras! Can it get any bigger than this? Watch this superhit reality fare hosted by Tollywood superstar Nani, and get set for some fun, excitement, and drama.
#biggboss2telugu
బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ మరింత రసవత్తరంగా సాగబోతోంది. కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ బిగ్ బాస్ హౌస్‌లోకి యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఎంటరయ్యాడు. ఈ మేరకు బిగ్ బాస్ నిర్వాహకులు ఓ ప్రోమో కూడా విడుదల చేశారు. తెలుగు టెలివిజన్ రంగంలో నెం.1 మేల్ యాంకర్‌గా తన హవా కొనసాగిస్తున్న ప్రదీప్ రాకతో అటు ప్రేక్షకుల్లోనూ ఈ రియాల్టీ షోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
యాంకర్ ప్రదీప్ రాకపై ఎలాంటి ప్రకటన లేకుండా.... ఒక్కసారిగా భారీ సౌండ్‌తో మిస్టర్‌పర్ఫెక్ట్ పాట ప్లే చేయడంతో ఇంటి సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ప్రదీప్ చాలా ముదురు, ఎవరికీ దొరకడు అనే విధంగా బ్యాగ్రౌండ్ సాంగ్ ఉండటం గమనార్హం.