KL Rahul 'Bro-Zoned' By Bollywood Actress Nidhhi Agerwal

Oneindia Telugu 2018-07-17

Views 187

Indian batsman KL Rahul was trolled on social media platforms after Bollywood actress Nidhhi Agerwal called him 'bro' in an Instagram post. The actress was rumoured to be dating the star cricketer after the two were spotted together on an outing after the IPL. However, Nidhhi has now played down all such rumours with her post.
#india
#klrahul
#teamindia
#england
#nidhhiagerwal

బాలీవుడ్ భామ నిధి అగర్వాల్‌తో ప్రేమలో ఉన్నాడంటూ టీమిండియా క్రికెటర్ రాహుల్‌పై వచ్చిన రూమర్లకు తెరపడింది. కొద్ది నెలల ముందు ముగిసిన ఐపీఎల్ అనంతరం కేఎల్ రాహుల్ ముంబైలోని ఓ రెస్టారెంట్లో.. బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌తో కనిపించాడు. దీంతో వెబ్ మీడియా, సోషల్ మీడియా అంతటా వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. ఆమె చేసిన ట్వీట్ వాటన్నిటికీ తెరపడే విధంగా ఉంది.ఆతిథ్య ఇంగ్లాండ్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో ముందుగా ఫీల్డింగ్ చేసింది టీమిండియా. అయితే మైదానంలో ఉన్న కేఎల్ రాహుల్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచిన నిధి అగర్వాల్.. ఆల్ ది బెస్ట్ బ్రో.. అంటూ కామెంట్ పెట్టింది. ఆ తర్వాత చేధనకు దిగిన టీమిండియాలో కేఎల్‌ రాహుల్‌ డకౌటయ్యాడు. ఇంతటితో అయిపోలేదు.. ఈ సారి రాహుల్‌ డకౌటవ్వడానికి నిధి అగర్వాల్ కారణమంటూ రాహుల్‌పై జోకులు పేలుస్తున్నారు నెటిజన్లు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS