Vijay revealed that he has auctioned his Filmfare award that he won for 'Arjun Reddy' to Divis laboratories for Rs 25 Lakh.
#Vijay
అర్జున్ రెడ్డి' సినిమాకుగాను యంగ్ హీరో విజయ్ దేవరకొండ 65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ వేడుకలో ఉత్తమ నటుడు అవార్డ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. జీవితంలో అందుకున్న తొలి వార్డుతో ఏదైనా మంచి పని చేయాలని నిర్ణయించుకున్న విజయ్ దాన్ని వేలం వేయాలని, తద్వారా వచ్చిన డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇవ్వాలని నిర్ణయించున్నారు. విజయ్ నిర్ణయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం స్పందిస్తూ అభినందించిన సంగతి తెలిసిందే.తాజాగా విజయ్ ఫిల్మ్ ఫేర్ అవార్డు భారీ రేటుకు అమ్ముడు పోయింది.
నా అవార్డు అసలు ఎవరైనా కొంటారా, కొంటే ఎంతకు కొంటారు? అనుకున్నా. ప్రతి నటుడికి ఫిల్మ్‌ఫేర్ చాలా ముఖ్యం. వేలం పెట్టా, చాలా మంది ముందుకు వచ్చారు. వారు నాకు ఫోన్ చేసి.. ఎంత ఊహిస్తున్నారు? అని అడిగేవారు. రూ.5 లక్షలు అని చెప్పేవాడిని. ఎందుకంటే ‘అర్జున్‌రెడ్డి' సినిమాకు సైన్ చేసినపుడు నేను తీసుకున్న పారితోషికం అది. ఆ తర్వాత లాభాల్లో షేర్ ఇచ్చారు. రూ. 25 లక్షలకు దివి లాబొరేటరీస్ వారు అవార్డు కొన్న తర్వాత... దాన్ని నా దగ్గరే పెట్టుకోమని శకుంతలాదేవి చెప్పారు. కానీ, వద్దు అన్నాను' అని విజయ్ పేర్కొన్నారు.