Ram Charan & Vivek Anand Oberoi Watches Football Match

Filmibeat Telugu 2018-07-14

Views 965

Vivek Anand Oberoi and Ram Charan bond over football. Ram Charan doing arrangements for Fifa World Cup
#RamCharan
#VivekAnandOberoi

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. రంగస్థలం వంటి భారీ విజయం తరువాత రాంచరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. వివేక్ ఒబెరాయ్, రాంచరణ్ సెట్స్ లో మంచి సాన్నిహిత్యంతో మెలుగుతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా వీరిద్దరూ సెట్ లో ఆసక్తికరమైన కార్యక్రమం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సినిమా నటులు చాల మంది క్రీడల పట్ల ఆసక్తి చూపించడం చూస్తూనే ఉన్నాం. విక్టరీ వెంకటేష్ ఎక్కువగా క్రికెట్ స్టేడియంలో దర్శనమిస్తుంటారు. రాంచరణ్, వివేక్ ఒబెరాయ్ ఇద్దరూ ఫిఫా వరల్డ్ కప్ మ్యాచులపై అత్యంత ఆసక్తి కనబరుస్తునట్లు తెలుస్తోంది.
వివేక్ ఒబెరాయ్, రాంచరణ్ ఇద్దరూ కలసి ఇప్పటికే ఫిఫా వరల్డ్ కప్ మ్యాచులు చూసినట్లు తెలుస్తోంది. వీరితో బోయపాటి శ్రీను కూడా కలిశారట. ప్రతి మ్యాచ్ ని మిస్ కాకుండా చూడడానికి ప్రాధాన్యత ఇచ్చారట.

Share This Video


Download

  
Report form