With an eye on the 2019 Lok Sabha elections, Prime Minister Narendra Modi will address 50 rallies across the country by February next year, covering more than 100 Lok Sabha constituencies, sources said today.
వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సన్నద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికులు రూపొందించినట్లుగా తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా 400 లోకసభ స్థానాల్లో రెండు వందల ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.
లోకసభ ఎన్నికలే లక్ష్యంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలోని వంద లోకసభ నియోజకవర్గాల్లో ప్రధాని నరేంద్ర మోడీ 50కి పైగా ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రధానితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, పార్టీ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు కూడా 50కి పైగా ర్యాలీల్లో పాల్గొంటారని తెలుస్తోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు ఈ ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రతి ర్యాలీ రెండు నుంచి మూడు లోకసభ స్థానాల మీదుగా ఉంటుందని తెలుస్తోంది. లోకసభ ఎన్నికల తేదీ ప్రకటించడానికి ముందే ఈ ర్యాలీలు పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈసీ ప్రకటనకు ముందు 400కు పైగా లోకసభ స్థానాలను కవర్ చేయాలని చూస్తున్నారు.
దేశవ్యాప్తంగా 400 లోకసభ స్థానాలను ప్రభావితం చేసేలా రెండు వందల వరకు ర్యాలీలు నిర్వహిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. 50 ర్యాలీలలో ప్రధాని మోడీ పాల్గొంటారని, అవి వందకు పైగా నియోజకవర్గాలను కవర్ చేస్తాయని, వాటితో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలలోను ప్రధానమంత్రి పాల్గొంటారని చెబుతున్నారు.