తెలుగు చిత్ర సీమ మరో ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయింది. సుమారు రెండు దశాబ్దాలకుపైగా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో ఆకట్టుకొన్న సీనియర్ నటుడు వినోద్ ఇకలేరు. శుక్రవారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. వినోద్ అసలు పేరు అరిశెట్టి నాగేశ్వరరావు. 1980లో వీ విశ్వేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన కీర్తి, కాంత, కనకం అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 300 చిత్రాలకు పైగా నటించారు.
వినోద్ అసలు పేరు అరిశెట్టి నాగేశ్వరరావు. 1980లో వీ విశ్వేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన కీర్తి, కాంత, కనకం అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 300 చిత్రాలకు పైగా నటించారు.
వినోద్ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా విలన్ పాత్రల్లో కూడా మెరిసారు. చంట, లారీ డ్రైవర్, నరసింహనాయుడు, ఇంద్ర సినిమాల్లో వినోద్ పోషించిన పాత్రలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తమిళంలో 28, హిందీలో 2 చిత్రాల్లో నటించారు.