ఇదో బ్లాక్ డే అంటున్న బజరంగ్ దళ్

Oneindia Telugu 2018-07-11

Views 690

శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామిపై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. గత ఏడాది నవంబర్ నెలలో జరిగిన రాష్ట్రీయ హిందూ సేవ సమావేశంలో పరిపూర్ణానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను బహిష్కరణ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. అనుమతి లేనిది హైదరాబాద్ రావొద్దని పేర్కొన్నారు.
దీంతో స్వామిని హైదరాబాద్ నుంచి తరలించారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని కించపరిచేలా, రెచ్చగొట్టేలా వివాదాస్పద సినీ విమర్శకుడు మహేష్ కత్తి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా పరిపూర్ణానంద స్వామి బోడుప్పల్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
మహేష్ కత్తి వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అతనిని నగరం నుంచి ఆరు నెలల పాటు బహిష్కరించారు. అతని వ్యాఖ్యలను నిరసిస్తూ యాత్ర చేపడతానన్న పరిపూర్ణానందను పోలీసులు రెండు రోజుల పాటు హౌస్ అరెస్ట్ చేశారు. తదుపరి కార్యాచరణ కోసం ఆయన పలువురితో చర్చలు జరిపారు. ఆయన హౌస్ అరెస్టును బీజేపీ నేతలు, హిందూ ధార్మిక సంఘాలు ఖండించాయి. ఇప్పుడు స్వామిపై చర్యల కోసం గత ఏడాదికి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇద్దరిని నగర బహిష్కరణ చేశారు.

Two days after externing film critic Mahesh Kathi from the city, the Hyderabad police on Wednesday issued the same orders against controversial Hindu seer Swamy Paripoornananda.
#mahenderreddy
#hyderabad
#paripoornanandaswami
#maheshkathi
#andhrapradesh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS