ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమను ప్రధాని నరేంద్ర మోడీ, దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జై సంయుక్తంగా ప్రారంభించారు. దక్షిణకొరియా దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శామ్‌సంగ్ నోయిడాలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఏటా 120 మిలియన్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చెయ్యాలని శామ్‌సంగ్ భావిస్తోంది. నోయిడా ప్రాంతంలోని దాదాపు 35 ఎకరాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 5వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫ్యాక్టరీగా ఇది నిలిచింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్‌గా భారత్ అవతరించిందని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Prime Minister Narendra Modi said his government's pet 'Make in India' initiative has propelled India to become the world's second-largest manufacturer of mobile phones as the number of factories soared to 120 from just 2 four years ago.
#samsung
#narendramodi
#makeinindia
#southkorea