పెట్రోల్,డీజిల్ ధరలు పెంచిన కుమార స్వామి

Oneindia Telugu 2018-07-06

Views 153

The BJP had a field day as Karnataka Chief Minister HD Kumaraswamy today announced a tax hike for petrol and diesel. The party used the above-Rs.1 per litre hike by the Congress-JD(S) government in the state to hit back at Congress chief Rahul Gandhi, who recently threw a "fitness challenge" at Prime Minister Narendra Modi.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే కర్ణాటక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు తొలి షాక్ ఇచ్చారు. విధాన సౌధలో తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రజలపై పెట్రో బాంబు వేశారు. పెట్రోల్ ధరలను లీటర్‌కు రూ.1.14, డీజిల్ పైన రూ.1.12 వరకు పెంచనున్నట్లు ప్రకటించారు.పెట్రోల్‌పై పన్ను రేటును 30 శాతం నుంచి 32 శాతం వరకు, డీజిల్‌పై 19 శాతం నుంచి 21 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపారు.
కాగా, పెట్రోల్, డీజిల్ పైన పన్ను భారం మోపాలని నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇంధన ఛార్జీలపై రాహుల్ గతంలో ప్రధాని మోడీకి విసిరిన సవాల్‌ను గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి, కర్ణాటకలోని కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వానికి చురకలు వేసింది.
రాహుల్‌ గాంధీ విసిరిన ఇంధన సవాల్‌ను స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాలేదని, కనీసం ఆయన సొంత ప్రభుత్వం కూడా ఆ పని చెయ్యలేదని, ఏదైనా ఓ విషయం గురించి తెలియకుండా, తెలుసుకోవాలనే ఉద్దేశం కూడా లేకుండా ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయని బీజేపీ రాహుల్ గాంధీకి కౌంటర్‌ ఇచ్చింది. ఓ వైపు పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి సవాల్ చేయగా, స్వయంగా వారి సొంత ప్రభుత్వం రాష్ట్రంలో పెంచడం విమర్శలకు తావిచ్చింది. గతంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన సమయంలో రాహుల్‌ ప్రధాని మోడీకి ఇంధన సవాల్ విసిరారు. కోహ్లీ విసిరిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ సవాలు స్వీకరించడమే కాదని, పెరిగిన ఇంధన ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, నా ఇంధన సవాల్ స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం ధరలు పెంచింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS