నాకు కులపిచ్చి ఉంటే మీకు మద్దతు ఇచ్చేవాడినా : పవన్

Oneindia Telugu 2018-07-05

Views 1

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాకు కులం అంటగడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం వాపోయారు. నాకు కులపిచ్చి ఉంటే మీకు మద్దతు ఇచ్చేవాడినా అని ముఖ్యమంత్రిని నిలదీశారు. 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చినప్పుడు, ఆ పార్టీకి ప్రచారం చేసినప్పుడు నా కులం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నేతలు డాల్ఫిన్ కొండలను మింగేసేలా ఉన్నారని విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలు పిచ్చివేషాలు వేస్తే చొక్కా పట్టుకొని రోడ్డు పైకి లాగుతానని జనసేనాని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను జనసేనను స్థాపించానని తెలిపారు.
జనసేనకు 10 శాతం ఓట్ల వాటా ఉందని అధికార టీడీపీ పోల్‌ సర్వేలో వెల్లడి కావడం మంచి ప్రారంభమని పవన్‌ కళ్యాణ్ అంతకుముందు రోజు ట్వీట్‌ చేశారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూడా పది శాతం ఓట్లతోనే మొదలయ్యారన్న విషయం జనసైనికులు గుర్తుంచుకోవాలన్నారు.

Jana Sena party chief Pawan Kalyan takes on Andhra Pradesh Chief Minister Nara Chandrababu for caste politics.
#pawankalyan
#chandrababunaidu
#andhrapradesh
#janasena

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS