చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు : గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఎందుకిచ్చావ్ పవన్ ?

Oneindia Telugu 2018-03-15

Views 98

Andhra Pradesh CM Chandrababu Naidu fired at Janasean Party president Pawan Kalyan for his comments on him and Nara Lokesh.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ బుధవారం సాయంత్రం గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభలో తనను, తన కుమారుడ్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేయడంపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి బుధవారం రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించినట్టు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీలో భారీ అవినీతి జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని సభలో పవన్ ప్రశ్నించారు. అంతేగాక, లోకేష్ కూడా అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని, అందుకే మోడీ కూడా అపాయింట్ ఇవ్వలేదనే వార్తలు వస్తున్నాయని అన్నారు పవన్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపైనా పవన్ తీవ్ర విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందిస్తూ.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదంటున్న కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, ప్రధాని నరేంద్ర మోడీని గానీ పల్లెత్తు మాట కూడా అనకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్న టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని రాజకీయశక్తులన్నీ ఏకమై కేంద్రాన్ని నిలదీసి ప్రత్యేకహోదా, ఇతర ప్రయోజనాలు సాధించుకోవాల్సిన సమయమని, టీడీపీ ఎంపీలు పార్లమెంటులోను, బయటా పోరాటం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వంలోని మా మంత్రులతో రాజీనామా చేయించామని, తాము ఇంతగా పోరాడుతుంటే, తమనే తిట్టడమేంటి? అని చంద్రబాబు.. పవన్‌ను నిలదీశారు.
‘మేం కులాల మధ్య చిచ్చు పెడుతున్నామనడం అర్థరహితం. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పాం. వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకు భంగం కలగకుండా రిజర్వేషన్లు ఇస్తామన్నాం. ఒక పద్ధతి ప్రకారం కమిషన్‌ వేసి, శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించాం. మత్స్యకారుల్ని ఎస్టీల్లో చేరుస్తామన్నదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనే. పవన్‌ గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. అంటే మేనిఫెస్టోలోని అంశాల్ని సమర్థించినట్టే కదా?' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు వంటి సమస్యల్ని తమ దృష్టికి తెచ్చినప్పుడు పవన్‌పై ఉన్న గౌరవంతో సానుకూలంగా స్పందించామని చంద్రబాబు చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS