S V Ranga Rao Centenary Celebration By Sangamam Foundation Part 2

Filmibeat Telugu 2018-07-04

Views 1.3K

తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్‌లు రెండు కళ్లు అయితే... ఎస్వీ రంగారావు గుండెకాయ'' అని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సంగమం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఎస్వీ రంగరావు శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. దేశ సినీజగత్తులో ఎస్వీ రంగారావు పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు.
భాషకు, భావానికి, హావభావాలకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రతి పాత్రకు జీవం పోసిన ఆయన నటనాకౌశల్యం అనితర సాధ్యమని వ్యాఖ్యానించారు. ప్రతినాయక పాత్రల్లోనే కాకుండా, క్యారక్టర్‌ ఆర్టిసుగానూ ఆయన మెప్పించారని, విలన్ పాత్రలు పోషించిన నటులపై మనకు వ్యతిరేక భావన కలుగుతుంటుంది. కానీ ఎస్వీ రంగారావుని రావణుడిగా, కీచకుడిగా, కంసునిగా ఇలా రకరకాల పాత్రల్లో చూసినా వ్యక్తిగతంగా ఆయనపై భక్తిభావం, ఆరాధాన కలుగుతుందని వెల్లడించారు.

Vice President M Venkaiah Naidu’s address at the S V Ranga Rao Centenary Celebration organised by Sangamam Foundation on July 3, 2018 in Hyderabad.
#SVRangaRao

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS