Mahesh Babu New Movie Release Date Got Fixed

Filmibeat Telugu 2018-07-03

Views 1

After Bharat Ane nenu hug hit, Super Star Mahesh babu doing project with Director Vamshi Paidipally. This movie release date announced by the film Unit. As per Reports, Movie set to release on April 5th.

మహేష్ బాబు హీరోగా వంశీ పడిపల్లి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ సోమవారం డెహ్రాడూన్‌లో మొదలైంది. ప్రధాన తారాగణంపై ఇక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ మహేష్ బాబు కెరీర్లో 25 చిత్రం. వాస్తవానికి జూన్ 10 నుండే ఇక్కడ షూటింగ్ మొదలు పెట్టి రెండు వారాల పాటు ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుండి అనుమతులు దొరికే విషయంలో ఇబ్బందులు ఏర్పడటంతో వారం ఆలస్యంగా షూటింగ్ మొదలైంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ మరియు వైజయంతీ మూవీస్‌ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది ఆగస్టులోనే ఈ మూవీ లాంచ్ అవ్వగా ఎట్టకేలకు మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ మూవీలో మహేష్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా కనిపించన్నారు. శర వేగంగా సినిమా పూర్తి చేసి సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకే తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కెరీర్లో 25వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. 'రాజసం' అనే టైటిల్ కొన్ని రోజుల క్రితం ప్రచారంలోకి వచ్చింది. అయితే చిత్ర బృందం ఇంకా దీన్ని ధృవీకరించలేదు.

Share This Video


Download

  
Report form