World Cup 2018: Adidas unveil match ball for the knockout stage

Oneindia Telugu 2018-06-30

Views 140

Adidas have unveiled the official match ball for the knockout stage of the World Cup 2018. The new ball is named 'Telstar Mechta' and it comes with a new red design. The name Mechta translates as ‘dream’ or ‘ambition’ in Russian.
#worldcup2018
#footballworldcup
#fifaworldcup
#russiaworldcup
#soccer

ప్రపంచకప్ పురస్కరించుకుని ఆనవాయితీగా బంతులు పంపిణీ చేస్తున్న అడిడాస్ సంస్థే వరల్డ్ కప్‌ అధికారిక మ్యాచ్‌ బాల్‌ను అందిస్తోంది. జూన్ 14 నుంచి ప్రారంభమై గ్రూపు దశను పూర్తి చేసుకున్న సందర్భంగా బంతిని మారుస్తున్నారు నిర్వహకులు. లీగ్‌ మ్యాచ్‌ల్లో ఉపయోగించిన బంతి స్థానంలో కొత్తగా ఎరుపు-తెలుపు బంతి రానుంది. నాకౌట్‌ దశ నుంచి ఈ బంతికి బదులు 'టెల్‌స్టార్‌ మెక్టా' అనే బాల్‌ను వినియోగించనున్నారు.నాకౌట్‌కు చేరిన దేశాల జెండా రంగులు అందులో ప్రతిబింబించేలా టెల్‌స్టార్‌ మెక్టాను రూపొందించారు. మెక్టా అంటే 'కల' అని అర్థం. శనివారం నుంచి ఈ కల మన కళ్లముందు ఆడనుంది. 1970 నుంచి ప్రపంచకప్‌ కోసం అడిడాస్‌ సంస్థ బంతులను తయారుచేస్తోంది. ఆ సంస్థ ప్రపంచకప్‌ కోసం తొలిసారిగా తయారుచేసిన బంతికి 'టెల్‌స్టార్‌' అని పేరు పెట్టింది. దాని కొనసాగింపుగా 2018 సంవత్సరాన్ని సూచిస్తూ ప్రస్తుత టోర్నీలో వాడే బంతికి 'టెల్‌స్టార్‌ 18' అని పేరు పెట్టారు.

Share This Video


Download

  
Report form