Alia Bhatt and Ranbir Kapoor to tie the knot in 2020. This news became hot topic in Bollywood
రణబీర్ కపూర్, అలియా భట్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ ఘాడమైన ప్రేమలో మునిగితేలుతున్నారని మీడియా మొత్తం ఢంకా బజాయించి చెబుతోంది. అందుకు తగ్గట్లుగానే వీరిద్దరూ పబ్లిక్ గా తిరగేస్తున్నారు. ఆమె మధ్యన సోనమ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ లో చెట్టాపట్టాలేసుకుని కనిపించిన సంగతి తెలిసిందే. తాజగా వీరిద్దరూ పెళ్లి విషయంలో కూడా ఓ క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియాలో వీరి పెళ్లి వార్త గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.
రణబీర్ కపూర్, అలియా భట్ 2020 లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పలు బాలీవుడ్ వెబ్ సైట్స్ కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ బ్రహ్మాస్త్ర అనే చిత్రంలో నటిస్తున్నారు.
రణబీర్ కపూర్ కి రొమాంటిక్ వీరుడిగా బాలీవుడ్ జనాల్లో పేరు ఉంది. దీపికా పాడుకొనే, కత్రినా కైఫ్, సోనమ్ కపూర్ ఇలా పలువురు భామలతో రణబీర్ ప్రేమాయణం సాగిందనే వార్తలు ఉన్నాయి. వీటిలో దీపికా, కత్రినా కైఫ్ తో బ్రేక్ అప్ కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.