waqar younis's team stunned everybody at last year’s Champions Trophy in England and Wales. Moreover, they enjoyed success at Lord’s in the first Test against England earlier this summer.Waqar, who has played three World Cups feels experience of playing in this conditions will help them next year.
ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను పాకిస్థాన్ జట్టు గెలుస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌తో 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలిచిన తర్వాత పాక్ ఆటతీరు మారిపోయిందని.. ముఖ్యంగా ఇంగ్లాండ్ గడ్డపై గత ఏడాదికాలంగా మెరుగ్గా రాణిస్తోందని యూనిస్ వివరించాడు.
'ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఒకసారి పాక్ ప్రదర్శనని పరిశీలిస్తే.. జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే వచ్చే ఏడాది తప్పకుండా పాకిస్థాన్ ప్రపంచకప్ గెలుస్తుందని నేను చెప్పగలుగుతున్నా. ఇప్పటి నుంచే జట్టుపై అంచనాలు ఉంటాయి. కాబట్టి.. ఒత్తిడి ఉండటం సహజమే. అందులో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం జరుగుతున్న అతి పెద్ద టోర్నీ కావడంతో.. పాకిస్థాన్ జట్టుకు భారీ స్థాయిలో మద్దతు చాలా అవసరం.'
'ఇంగ్లాండ్‌లో పాకిస్థానీలు ఎక్కువగా ఉన్నారు. వారంతా స్టేడియాలకి వచ్చి పాక్‌కు పెద్ద ఎత్తున మద్దతిస్తారు. ఆ ఉత్సాహంతోనైనా కచ్చితంగా పాక్ జట్టు కప్ గెలిచితీరుతుంది. ' అని వకార్ యూనిస్ ధీమా వ్యక్తం చేశాడు. 2019 మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ ప్రారంభంకానుండగా.. మే 31న ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో పాక్ జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది.