The Real Madrid team-mates will do battle in a blockbuster Group B clash in Sochi on Friday. powered by Rubicon Project Ramos said he preferred to be playing alongside Ronaldo rather than against the star forward, but he is simply hoping the 33-year-old is not at his best at the Fisht Olympic Stadium.
#fifaworldcup2018
రష్యా తొలిసారిగా నిర్వహిస్తున్న ఫిఫా వరల్డ్ కప్‌కు సర్వం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తోన్న 21వ ఫిఫా వరల్డ్ కప్ ...ఫిఫా వరల్డ్ కప్ అనగానే అత్యుత్తమ పోరాటాలు గుర్తొస్తాయి. ప్రపంచంలోనే మేటి ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తారు.
ఈ వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్ల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోన్న పేర్లు లియోనల్ మెస్సీ , క్రిస్టియానో రొనాల్డో, నేయమార్. వీరితో పాటు హ్యారీ కేన్ (ఇంగ్లాండ్), మహమ్మద్ సలా (ఈజిప్ట్), ఆంటోనీ గ్రిజ్‌మన్ (ఫ్రాన్స్), కెవిన్ డి బ్రూన్ (బెల్జియం) తమ ఆటతో అభిమానులను కనువిందు చేయనున్నారు.
అయితే, వీరిలో అభిమానులు మాత్రం మెస్సీ, రొనాల్డోపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఎందుకంటే రష్యా ఆతిథ్యమిస్తోన్న వరల్డ్ కప్ వీరికి చివరి వరల్డ్‌కప్ కావచ్చని పుట్‌బాల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రపంచ దృష్టి మొత్తం ఈ ఇద్దరు స్టార్లపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప? అనే చర్చకు తెరదీసింది.
నిజానికి ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప? అంటే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఓటమి అంచున్న ఎన్నో మ్యాచ్‌లను వీరి ఒంటి చేత్తో గెలిపించిన సందర్భాలు అనేకం. ఇద్దరి మధ్య అంతటి పోటీ నెలకొంది. అంతేకాదు రష్యా వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ కప్‌లో ఈ ఇద్దరూ గోల్డెన్‌బూట్ అవార్డు రేసులో కూడా ఉన్నారు.