Rashid Khan A Great Competitor To Indian Players

Oneindia Telugu 2018-06-12

Views 170

Rashid Khan held his nerve in the final over to deny Bangladesh the eight runs they needed, though the teenage leg-spinner needed a helping hand from team-mate Shafiqullah in a dramatic finish.

మరికొద్ది రోజుల్లో భారత్, అఫ్ఘనిస్థాన్ జట్టుతో ఏకైక టెస్టు ఆడనుంది. గతేడాది ఐసీసీ హోదా పొందిన అఫ్ఘన్ తన తొలి మ్యాచ్‌ను భారత్‌తోనే తలపడేందుకు సిద్ధమైంది. బెంగళూరు వేదికగా గురువారం నుంచి జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కి అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సవాల్ విసరగలడని స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు.
దీనికి తోడు కొద్దిరోజులుగా ఆ జట్టు స్పిన్నర్లు రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న నేపథ్యంలో మ్యాచ్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. గడిచిన వారంలో బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని అఫ్గానిస్థాన్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
'అఫ్గానిస్థాన్‌‌కి చెందిన ఇద్దరు స్పిన్నర్లు ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్లని సైతం బోల్తా కొట్టిస్తున్న తీరు అద్భుతం. అయితే ఇప్పటి వరకు రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లు టీ20ల్లోనే ఎక్కువగా రాణించారు. కానీ.. టెస్టులతో పోలిస్తే టీ20 ఫార్మాట్ పూర్తి భిన్నం. కాబట్టి.. ఇప్పటివరకు మ్యాచ్‌లో కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేస్తూ వచ్చిన ఈ ఇద్దరూ టెస్టుల్లో ఎలా రాణిస్తారోనని ఆసక్తి నెలకొంది. లయ అందుకుంటే భారత బ్యాట్స్‌మెన్స్‌కే కాదు.. ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్‌కైనా ఈ స్పిన్నర్లు సవాల్ విసరగలరు' అని అనిల్ కుంబ్లే వెల్లడించారు.

Share This Video


Download

  
Report form