SriReddy did mistake while supporting Nara Lokesh. SriReddy warns Pawan Kalyan
శ్రీరెడ్డి పోరాటం ఇండస్ట్రీలోని కాస్టింగ్ కోచ్ పైనా లేక పవన్ కళ్యాణ్ పైనా అనే విషయం సగటు ప్రజలకు అర్థం కానీ పరిస్థితి నెలకొని ఉంది. అంతే కాదు ఏపీ మంత్రి నారా లోకేష్ ని ఏమైనా అంటే ఊరుకునేది లేదని కూడా వార్నింగ్ ఇస్తోంది. ఎడతెరిపిలేకుండా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా శ్రీరెడ్డి కామెంట్లు చేస్తూనే ఉంది. తాజగా పవన్ కళ్యాణ్ తిడుతూ, మంత్రి లోకేష్ ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో శ్రీరెడ్డి పప్పులో కాలేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
యూట్యూబ్ లో నారా లోకేష్ గురించి ఉన్న ఓ వీడియో గురించి శ్రీరెడ్డి ప్రస్తావిస్తూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోను అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల కాలంలో నారా లోకేష్ కు మద్దత్తుగా శ్రీరెడ్డి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.
నారా లోకేష్ గురించి పోస్ట్ పెట్టిన సమయంలో నారా రోహిత్ అంటూ శ్రీరెడ్డి ప్రస్తావించింది. నారా రోహిత్ ని అంటే చూస్తూ ఊరుకోను అంటూ పేర్కొంది.