Telangana CM KCR Gets Praised By Tollywood Heroes

Filmibeat Telugu 2018-06-02

Views 278

After Telangana Formation, What is the condition of Telugu film industry in new state?. Many film personalities have expressed satisfaction. Many actors appreciated the KCR government.
#TelanganaFormation
#KCRgovernment

కేంద్ర ప్రభుత్వం జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పరిశ్రమ హైదరాబాద్ నుండి వైజాగ్, ఇతర ప్రాంతాలకు తరలిపోతుందనే ఊహాగానాలుకూడా ఎక్కువయ్యాయి. అయితే కొత్త రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ఉద్యమ నేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ఆంధ్రా, రాయలసీమ వాసుల్లో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టి తెలంగాణ రాష్ట్రంలో సెటిలైన వారంతా ఈ గడ్డను తమ సొంత రాష్ట్రంగా భావించే స్థాయికి పరిస్థితులును మలచడంలో కేసీఆర్ సఫలం అయ్యారని చెప్పక తప్పదు.
2017లో ప్రపంచ తెలుగు మహాసభలను కేసీఆర్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలను నిర్వహించిన తీరుపై ఆంధ్రప్రాంతానికి చెందిన తెలుగు భాషాభిమానులు సైతం ప్రశంసలు గుప్పించడం గమనార్హం.
ఈ తెలుగు మహా సభల్లో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులను ప్రత్యేకంగా సత్కరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ మహాసభలకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు, ఆర్ నారాయణ మూర్తి లాంటి ఆంధ్రప్రాంతానికి చెందిన స్టార్ కొత్త తెలంగాణ ప్రభుత్వం మీద ప్రశంసల వర్షం కురిపించారు.
సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రంలో 1వ నుండి 12వ తరగతి వరకు తెలుగు భాష తప్పనిసరి చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అని తెలుగు మహా సభల సందర్భంగా చిరంజీవి ప్రశంసలు గుప్పించారు. ఈ సందర్భంగా కొత్త రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన పలు చర్యలను చిరంజీవి మెచ్చుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS