Super star mahesh babu new look for 25th film. Vamshi Paidipally will going to direct this movie
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. భరత్ అనే నేను చిత్ర విజయాన్ని పూర్తిగా ఆస్వాదించిన తరువాత త్వరలో కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. మహేష్ కోసం వంశీ పైడిపల్లి రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాడు.
దిల్ రాజు, అశ్వినీదత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. జూన్ 10 ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అల్లరి నరేష్ .. మహేష్ కు స్నేహితుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం కోసం మహేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.