Nellore recorded the highest maximum temperature of 45 degree celsius, according to Indian Meteorological Department (IMD).
#andhrapradesh
#summerseason
#temperatures
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన ఉక్కపోతతో జనం ఇబ్బందిపడుతున్నారు. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినప్పటికీ.. అవి తెలుగు రాష్ట్రాలను తాకడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు. దీంతో మరికొద్ది రోజులు ఈ ఎండల తీవ్రత తప్పేలా లేదు. ఎండల తీవ్రతకు వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణ పవనాలు కూడా కారణమని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.
మహారాష్ట్రలోని విదర్భ, ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాలకు ఉష్ణ గాలులు వీస్తున్నందునా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నెల్లూరులో గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడ, అమరావతి, ఒంగోలు, కర్నూలులో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.