Manish Malhotra Gives Strong Reply

Filmibeat Telugu 2018-05-30

Views 180

Karan Johar and Manish Malhotra are the best of friends. Hours ago, the rumour mills went into an overdrive and churned out story after story that the two were more than just friends.


బాలీవుడ్‌లో దర్శక, నిర్మాత కరణ్ జోహర్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా మంచి స్నేహితులు అనేది కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. కానీ స్నేహం కంటే వారి మధ్య మరో బంధం ఉందనే రూమర్లు చాలానే వచ్చాయి. కానీ మేము కేవలం స్నేహితులం మాత్రమే. మా మధ్య ఉన్నది స్నేహ బంధం మాత్రమే అని అలాంటి వార్తలకు సమాధానం ఇచ్చారు. కానీ ఇటీవల మనీష్ మల్హోత్రా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోకు ఓ ఫ్యాన్ చేసిన కామెంట్ వివాదాస్పదమైంది.
ఇటీవల దర్శక, నిర్మాత కరణ్ జోహర్ 46 ఏట అడుగుపెట్టారు. ఆ సందర్భంగా హ్యాపీ హ్యాపీ బర్త్ డే మై డియరెస్ట్, బెస్టెస్ట్ ఫ్రెండ్. ఈ ఏడాదిలో కూడా మీకు మంచి జరుగాలి. మన మధ్య 25 ఏళ్ల ఫ్రెండ్‌షిప్ ఉంది. అప్పటి నుంచి కలిసి పనిచేస్తున్నాం. అలాగే మన స్నేహం కలకాలం నిలిచిపోవాలి అంటూ కామెంట్ పెట్టాడు
తనతోపాటు కరణ్ జోహర్‌ ఉన్న ఫోటోను మనీష్ మల్హోత్రా పోస్ట్ చేశారు. వారిద్దరూ కౌగిలించుకొని ఉండటంపై ఓ నెటిజన్ స్పందించారు. మీరిద్దరూ ముచ్చటైన, అందమైన జంట అని కామెంట్ చేశారు. ఆ కామెంట్‌పై మనీష్ భగ్గుమన్నారు.
కరణ్‌కు నాకు మధ్య రొమాంటిక్ రిలేషన్ ఉందని వస్తున్న కామెంట్లు, కథనాలు చాలా దారుణం. ఆ విధంగా అలా సంబంధాలను అంటగడుతారు. కరణ్ నాకు బ్రదర్ లాంటి వాడు అని మనీష్ వివరణ ఇచ్చారు.

Share This Video


Download

  
Report form