IPL 2018 : Compounder Son Entered in IPL

Oneindia Telugu 2018-05-26

Views 76

Khaleel Ahmed was travelling home from Kolkata — after playing the final of the Syed Mushtaq Ali T20 — when the news of him being picked by Sunrisers Hyderabad for a whopping Rs. 3 crore, broke out.
#khaleelahmed
#ipl2018
#dineshkarthik
#kanewilliamson
#sunrisershyderabad

ఐపీఎల్ టోర్నీలో భాగంగా రెండో ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో తేల్చుకునేందుకు శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు పోటీ పడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ విలియమ్సన్ చెప్పాడు. మనీష్ పాండే, శ్రీవాత్స్ గోస్వామి, సందీప్ శర్మ స్థానాల్లో హుడా, సాహా, ఖలీల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మిడిలార్డర్‌లో రాణిస్తాడని బెంగళూరులో జరిగిన వేలంలో మనీశ్ పాండేని ఆ జట్టు యాజమాన్యం రూ.11 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఇప్పటివరకు మనీష్ పాండే 15 మ్యాచ్‌లాడి 284 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు జట్టుని గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. దీంతో ఎంతో కీలకమైన రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో పాండేతో పాటు శ్రీవాత్స్ గోస్వామి, సందీప్ శర్మను జట్టు నుంచి తప్పించారు. వారి స్థానంలో దీపక్ హుడా, వృద్ధిమాన్ సాహా, ఖలీల్ అహ్మద్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు.
దీంతో ఖలీల్ అహ్మద్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌ని ఆడుతున్నాడు. ఐపీఎల్ వేలంలో ఖలీల్‌ అహ్మద్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం రూ.3 కోట్లు పెట్టి కొనుగోలు చేసినప్పుడే అతడి గురించి సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో ఖలీల్ చక్కటి ప్రదర్శన చేయడంతో వేలంలో ప్రాంఛైజీలు అతడి కోసం పోటీ పడ్డాయి.
దీంతో చివరకు ఖలీల్ అహ్మద్‌ను వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం సొంతం చేసుకుంది. అయితే, లీగ్ దశలో కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడేందుకు ఖలీల్ అహ్మద్‌కు అవకాశం రాలేదు. తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో పాండే విఫలం కావడంతో పాటు జట్టు కూడా ఓటమిపాలైన నేపథ్యంలో సన్‌రైజర్స్ అతనికి తుది జట్టులో చోటు కల్పించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS