Srinivas Avasarala is an Indian film director and music director, screenwriter, dialogue writer, actor and television presenter. Latest news that avasarala srinivas going to do a film as a hero. new director balaji going to direct this film.
తెలుగు సినీరంగంలో మల్టి స్టారర్ సినిమాల నిర్మాణం జోరందుకుంది. ఇద్దరు స్టార్స్ కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పలు కాంబినేషన్ సినిమాలు మొదలుకానున్నాయి. ప్రస్తుతం నాగార్జున, నాని సినిమా చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్నారు. ఇప్పుడు అవసరాల శ్రీనివాస్, నవీన్ విజయ్ కృష్ణ నటిస్తున్నారు
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అష్టా-చమ్మా సినిమాతో కెరీర్ ప్రారంభించిన అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సక్సెస్ అవ్వడం జరిగింది. వీరిద్దరూ... త్వరలో మరోసారి కలిసి వర్క్ చేయబోతున్నారు. అయితే ఈసారి ఒకరు దర్శకులుగా మరొకరు హీరోగా.
ఊహలు గుసగుసలాడే చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన నటుడు అవసరాల శ్రీనివాస్ ఆ సినిమా తరువాత 'జ్యో అచ్యుతానంద' పేరుతో మరో సినిమా కు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత నాని హీరోగా ఓ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కాని ఆ సినిమాపై పూర్తి క్లారిటి రావాలి.
ఆవసరాల శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా చెయ్యబోతున్నాడు. సీనియర్ యాక్టర్ నరేష్ అబ్బాయి నవీన్ విజయ్ కృష్ణ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదారాబాద్ లోని ఫిలం నగర్ లో పెద్ద ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి ఇంట్లో జరుగుతోంది. నూతన దర్శకుడు బాలాజీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.