The Secret Behind The Success Of Virat Kohli And Anushka Family Life

Oneindia Telugu 2018-05-23

Views 251

Virat Kohli and Anushka Sharma are the power couple of Indian sports arena with them attracting a lot of eye balls wherever they travel. But what's the secret behind the success of their marriage life? How are they managing not to get distracted amidst the attention?
#viratkohli
#india
#cricket
#IPL

సెలబ్రిటీ అవడం కాదు కష్టం అది కాపాడుకోలేకపోతే మొత్తానికే ఎసరు అంటున్నాడు విరాట్ కోహ్లీ. ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్ ఈఎస్‌పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఆడేందుకు హోటళ్లకు వెళుతూంటాం. ఆ సమయంలో తాము ఉండే లగ్జరీ హోటళ్లే తమకు రాయల్ జైళ్లలాంటివి అని కోహ్లి అన్నాడు.
ఈఎస్‌పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. హోటల్ రూమ్స్‌లో ఉన్న సమయంలో ఏమీ చేయడానికి వీలుండదని చెప్పాడు. హోటల్లో ఉన్నపుడు భోజనం కూడా రూమ్‌లోకే తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సెలబ్రిటీ స్టేటస్ కారణంగా కనీసం హోటల్లో ఉన్న రెస్టారెంట్‌కు నేరుగా వెళ్లి కాసేపు కూర్చునే వీలు కూడా ఉండదని అతను అన్నాడు. ఇక హోటల్ బయటకు వెళ్లే సాహసం అసలే చేయబోనని కోహ్లి చెప్పాడు.
ఏడేళ్ల కిందట తనకు ఇంత పాపులారిటీ లేని సమయంలో హాయిగా వెళ్లి గంటల తరబడి రెస్టారెంట్లో కూర్చున్నా ఎవరో పట్టించుకునేవాళ్లు కాదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పుకొచ్చాడు. ఒకవేళ కచ్చితంగా బయటకు వెళ్లాల్సి వస్తే.. ఎలాగోలా స్టాఫ్ కారిడార్లలో నుంచి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోతానని చెప్పాడు. ఇలాగే విదేశాల్లో ఉన్నప్పుడు అనుష్క, కోహ్లీ కాఫీ షాప్‌కు వెళ్లినప్పుడు అక్కడు ముగ్గురు ఇండియన్స్ వాళ్లని గుర్తు పట్టేశారని వాళ్లని సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దంటూ కోరాల్సి వచ్చిందని తెలిపాడు.
అయితే ఈ సెలబ్రిటీ స్టేటస్‌ను సరిగా హ్యాండిల్ చేయలేకపోతే మాత్రం కెరీర్‌కే ముప్పు వాటిల్లుతుందని యువ క్రికెటర్లకు అతను సూచించాడు. తన జీవితం ఓ పెద్ద ప్రయోగమని, భవిష్యత్తు తరాలు దాన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చని కోహ్లి అన్నాడు. తను ఇంటికి వెళ్లేసరికి గెలుచుకున్న ట్రోఫీలు, లక్ష్యాలు, ఇవేమీ గుర్తుండవని తెలిపాడు.

Share This Video


Download

  
Report form