వైయస్ జగన్, పవన్ కళ్యాణ్‌ కుట్ర రాజకీయాలు చేస్తే ఖబడ్దార్ : చంద్రబాబు

Oneindia Telugu 2018-05-23

Views 461

At the Dharma Porata Deeksha here on Tuesday, the Chief Minister said the Centre had promised special assistance in place of Special Category Status (SCS) and later went back on its promise. The promised funds for Amaravati and Polavaram, railway zone with headquarters in Visakhapatnam, Dugarajupatnam Port, Steel Plant in Kadapa and Metro rail in Visakhapatnam and Vijayawada were not sanctioned. The YSR Congress Party was indulging in dramas by calling for a no-confidence motion.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ధర్మపోరాట సభలో ఆయన ప్రసంగించారు. 'మనం న్యాయం భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను నిలదీసేందుకు తొలి సభ తిరుపతిలో పెట్టాం. నాలుగేళ్ల కంటే ముందు అదే రోజున ప్రధాని అభ్యర్థిగా మోడీ హామీ ఇచ్చారు' అని అన్నారు.
‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? వేరే రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మాపై ఎందుకీ వివక్ష? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానికి లేదా? మాకు ఇది జీవన్మరణ సమస్య. విశాఖ రైల్వేజోన్‌ మా హక్కు. దానికి అడ్డుచెబితే మీ అడ్రస్‌ గల్లంతే' అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని హెచ్చరించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఢిల్లీ స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ-బీజేపీ ఆటలు సాగవన్నారు. కుట్ర రాజకీయాలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో 25ఎంపీలను టీడీపీకి ఇవ్వాలని, అలా అయితేనే హోదాతోపాటు ఇతర డిమాండ్లను సాధించుకోవచ్చన్నారు. అంతేగాక, ప్రధానిని కూడా నిర్ణయించే అవకాశం ఉంటుందని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS