IPL 2018 : Dhoni Creates World Record For Most Catches

Oneindia Telugu 2018-05-21

Views 41

Chennai Super Kings captain MS Dhoni broke two world records with his performance against the Kings XI Punjab, where he took three catches to dismiss Chris Gayle, Manoj Tiwary and Ravichandran Ashwin.
#ChennaiSuperKings
#Dhoni
#ChrisGayle
#ManojTiwary
#IPL2018

వయస్సు పెరుగుతున్నా.. ఫామ్ ఏ మాత్రం తగ్గకుండా ఆడుతున్నాడు కెప్టెన్ కూల్ ధోనీ. బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ అతనికి సాటిలేరంటూ రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు. ఐపీఎల్ 11లో ఇప్పటికి లీగ్ దశ ముగిసింది. ఆదివారం చెన్నై, పంజాబ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌తో ధోనీ మరో కొత్త రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకూ టీ20 పట్టిన క్యాచ్‌లలోనూ, వికెట్ కీపర్‌గానూ అరుదైన రికార్డు సృష్టించాడు.
టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర రికార్డును ధోనీ బ్రేక్ చేశాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్, మనోజ్ తివారీ, అశ్విన్ క్యాచ్‌లను అందుకున్న మహీ.. టీ20 ఫార్మాట్లో మొత్తం 144 క్యాచ్‌లు అందుకున్నాడు. సంగక్కర 142 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. సంగక్కర తర్వాతి స్థానంలో దినేశ్ కార్తీక్ (139) ఉన్నాడు. నాలుగో స్థానంలో కమ్రాన్ అక్మల్ (123) ఉండగా.. దినేశ్ రామ్‌దిన్ (111), నమన్ ఓజా (106) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టీ20ల్లో ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చిన వికెట్ కీపర్‌గానూ ధోనీ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ కమ్రాన్ అక్మల్ (215) పేరిట ఉండగా.. దాన్ని ధోనీ (216) బ్రేక్ చేశాడు. కుమార సంగక్కర (202) మూడో స్థానంలో ఉండగా.. దినేశ్ కార్తీక్ (192) నాలుగో స్థానంలో ఉన్నాడు. దినేశ్ రామ్‌దిన్ (155), నమన్ ఓజా (130) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Share This Video


Download

  
Report form