Virat Kohli said on Saturday (May 19) Royal Challengers Bangalore batsmen did not show enough composure while chasing against Rajasthan Royals and the defeat has been hurting.
#Kohli
#RoyalChallengersBangalore
#IPL2018
#Cricket
ఇటీవల జరిగిన మ్యాచ్‌లలో ఆఖరి మ్యాచ్‌ను మినహాయించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లలో కెప్టెన్ విరాట్ ప్రదర్శన అంతగా ఏం ప్రభావం చూపించలేదు. ఈ క్రమంలో విరాట్ ఫిట్‌నెస్ కోల్పోయాడంటూ.. చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ట్వీట్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. వీటిపై కోహ్లి స్పందిస్తూ ట్విటర్ వేదికగా అభిమానులకు వివరణ ఇచ్చాడు.
'ప్రతి విషయాన్ని నాకు అంటగడుతూ.. నా ఫిట్‌నెస్‌పై తప్పుడు ఫొటోలను ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటికి నేటి మ్యాచ్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్‌లో సమాధానాలు తెలియజేస్తాను. ఇక నేను తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తాను. ఇంటి ఫుడ్‌నే తీసుకుంటాను. కనీస చిప్స్ కూడా తినను. నా ఆరోగ్యం పట్ల మీ ఆందోళనను నేను అర్ధం చేసుకున్నాను. పూర్తి ఫిట్‌నెస్‌గా ఉన్నాను. ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని కోహ్లి అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
ఇక ఐపీఎల్‌లో కోహ్లి కెప్టెన్సీ వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.