Ram Charan Birthday Wishes To NTR Goes Viral

Filmibeat Telugu 2018-05-21

Views 919

Ram Charan Birthday Wishes To NTR Goes Viral .Ram Charan wishes NTR on his birthday. NTR, Charan pic goes viral


మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య బంధం బలపడుతోంది. ఇటీవల కాలంలో అభిమానులు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ తరచుగా కలుసుకుంటున్నారు. ఒకరి సినిమాల విషయంలో మరొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుక. అభిమానులు భారీస్థాయిలో ఎన్టీఆర్ పుట్టినరోజుని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎన్టీఆర్ కు వెల్లువలా వస్తున్నాయి. తాజగా రాంచరణ్ కూడా ఎన్టీఆర్ కు అద్భుతమైన రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు.
సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన రాంచరణ్ ఓ అద్భుతమైన ఫోటోని షేర్ చేసాడు. ఎన్టీఆర్ ని హగ్ చేసుకుని నలిపేస్తున్న రాంచరణ్ ఫోటో వైరల్ గా మారింది. వీరి మధ్య బంధానికి ఇదే నిదర్శనం అని అభిమానులు అంటున్నారు. రాంచరణ్ సతీమణి ఉపాసన కూడా అమేజింగ్ బాండింగ్ అంటూ ఈ ఫోటో గురించి స్పందించింది.
రాంచరణ్, ఎన్టీఆర్ త్వరలో రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. భారీస్థాయిలో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో, రాంచరణ్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నారు.

Share This Video


Download

  
Report form