AravindhaSametha Veera Raghava First Poster Going Viral.NTR had two shades in AravindhaSametha Veera Raghava. Trivikram is directing this movie.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ టైటిల్, ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికర కథనాలు మీడియాలో వస్తున్నాయి. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపు దిద్దుకుంటున్న తొలి చిత్రం ఇదే. ఆసక్తికరమైన కథతో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సిక్స్ ప్యాక్ లుక్ లో ఎన్టీఆర్ లుక్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అరవింద సమేత వీర రాఘవ టైటిల్ త్రివిక్రమ్ స్టైల్ లో ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రానికి మొదట రాఘవ అనే టైటిల్ ఫిక్స్ చేయాలనీ భావించారట. కానీ ఎన్టీఆర్ పాత్రని దృష్టిలో పెట్టుకున్న త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
టైటిల్ డిజైన్ విషయంలో త్రివిక్రమ్ సెంటిమెంట్ ని ఫాలో అయినట్లు కూడా తెలుస్తోంది. అత్తారింటికి దారేది, అ.. ఆ చిత్రాలలో అ సెంటిమెట్ కలసి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అజ్ఞాతవాసి చిత్రం బెడిసికొట్టింది.