The 11th edition of the Indian Premier League (IPL) is nearing the fag end of its league stages. Sunrisers Hyderabad are going to finish as the number one spot in the 8-team standings with 18 points from 13 games.
#Kolkataknightriders
#SunrisersHyderabad
#IPL2018
#Dinesh Karthik
#KaneWilliamson
#RashidKhan
ఐపీఎల్ 11వ సీజన్ మలి దశకు వచ్చినప్పటికీ ప్లేఆఫ్ బెర్తులపై ఇంకా స్పష్టత రాలేదు. మ్యాచ్ మ్యాచ్‌కు ఉత్కంఠరేపుతూ జట్లు అనూహ్య విజయాలు సాధించడంతో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్(18), చెన్నై సూపర్ కింగ్స్(16) ప్లేఆఫ్ బెర్తులను ఖరారు చేసుకోగా, మిగిలిన రెండు బెర్తుల కోసం ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం నగరంలోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ జట్టుతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోవాలంటే కోల్‌కతా ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలువాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక వేళ మ్యాచ్ ఓడిపోతే మిగతా జట్ల గెలుపు, ఓటములపై కోల్‌కతా భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లతో పాయింట్ల పట్టకిలో అగ్రస్థానంలో కొనసాగుతుంటే.. కోల్‌కతా 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కాగా, సన్‌రైజర్స్ వరుసగా రెండు ఓటములతో ఒకింత ఒత్తిడిలో ఉండగా, రాజస్థాన్‌పై విజయం సాధించి కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.
పాయింట్ల పరంగా కోల్‌కతా మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ మ్యాచ్‌లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి. బౌలింగ్‌తో ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా నిలుస్తూ వరుస విజయాలతో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్, గత రెండు మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోయింది. చెన్నై, బెంగళూరు జట్లతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఓడిపోయింది.
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ బసిల్ థంపీ రికార్డు స్థాయిలో నాలుగో ఓవర్లలో 70 పరుగులిచ్చుకుని ఐపీఎల్‌లో అత్యంత చెత్తరికార్డును నమోదు చేశాడు. దీంతో శనివారం కోల్‌కతాతో జరగనున్న మ్యాచ్‌లో థంపీని తప్పించే అవకాశముంది. ఇక, బ్యాటింగ్‌లో కెప్టెన్ విలియమ్సన్ జోరు కొనసాగుతుండగా, బెంగళూరు మ్యాచ్‌లో పాండే ఫామ్‌లోకి వచ్చాడు.