Sri Reddy lodged complaint against 30 people in Humayun Nagar Police Station. She offered a representation to ACP Ashok Chakravarthy seeking action against all of them. Jeevitha Rajasekhar is one of the prominent personalities on whom complaint has been lodged.
#SriReddy
#JeevithaRajasekhar
కాస్టింగ్ కౌచ్, సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి తన సంచలన చర్యలతో మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఫిల్మ్ ఛాంబర్ ముందు బట్టలు విప్పి అర్దనగ్నంగా నిరసన తెలుపడం ద్వారా శ్రీరెడ్డి వ్యవహారం జాతీయ, అంతర్జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్ అయ్యాయి. ఈ క్రమంలో శ్రీరెడ్డి కొందరు హీరోలు, డైరెక్టర్ల మీద ఆరోపణలు చేయడం, వారి అభిమానులు, మద్దతు దారులు ఆమెను విమర్శిస్తూ కామెంట్స్ చేయడం తెలిసిందే. కొందరు తనను వేధించారని, బెదిరించారని శ్రీరెడ్డి ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ హక్కులు, సమస్యలపై పోరాటం చేస్తుంటే కొందరు తమను అసభ్య పదజాలంతో దూషించడం, బెదిరింపులకు పాల్పడటం లాంటివి చేశారంటూ శ్రీరెడ్డి పోలీసులను సంప్రదించారు. టీవీ ఛానల్స్, సోషల్ మీడియా ద్వారా తనపై కామెంట్లు చేసిన దాదాపు 30 మందిపై ఆమె ఫిర్యాదు చేశారు.
తనకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన, వేధింపులకు గురి చేసి, బెదిరించి వారందరిపైనా ఆమె కేసు పెట్టారు. తన పోరాటాన్ని తప్పుబడుతూ కామెంట్లు చేసిన వారిని సైతం శ్రీరెడ్డి వదల్లేదని ఈ కప్లయంట్ కాపీలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.
సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా వేధింపులకు గురి చేసినా, దూషణకు దిగినా, దాడి చేసినా అమ్మాయిలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని, వారికి తాము అండగా ఉంటామని శ్రీరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
జీవిత రాజశేఖర్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ యోగి కుమార్(షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్) అశ్వారావు పేట కుర్రాళ్లు వైష్ణవి జూనియర్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గాయిత్రి గుప్తా అరవింద్ 2 హీరో అజయ్ కౌండిన్య రాఘవ రెడ్డి కళ్యాణ్ దీప్ సుంకర శకలక శంకర్