Keerthy Suresh in consideration for Rajamouli movie. RamCharan, NTR multistarrer will starts soon
#KeerthySuresh
#Rajamouli
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యుంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దర్శకధీరుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు మొదలైపోయాయి. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కించబోతున్న చిత్రం కావడం, ఎన్టీఆర్, చరణ్ తో మల్టీస్టారర్ చిత్రం కావడంతో ఈ చిత్రంఫై అత్యంత ఆసక్తి నెలకొని ఉంది. ఈ భారీ మల్టీస్టారర్ గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు ప్రచారంలో ఉన్నాయి. తాజగా హీరోయిన్ విషయంలో ఓ వార్త ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహానటి చిత్రంలో సావిత్రిగా అందరిని అబ్బురపరిచిన కీర్తి సురేష్ గురించి కావడం విశేషం.
రాంచరణ్, ఎన్టీఆర్ ఎప్పుడూ సన్నిహితంగా ఉంటారు. ఆ ఉద్దేశంతోనే రాజమౌళి వీరిద్దరిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ తో ఓ చిత్రాన్న, ఎన్టీఆర్ తో మూడు చిత్రాలని రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
రాజమౌళి ప్రస్తుతం చిత్ర కాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నటనకు రాజమౌళి ఫిదా అయ్యారు. తాజగా సమాచారం మేరకు కీర్తి సురేష్ ని రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రం కోసం హీరోయిన్ గా ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు వస్తున్నాయి.
రాంచరణ్ బోయపాటి చిత్రంతో, ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతో బిజిగా ఉన్నారు. ఈ చిత్రాలని త్వరగా పూర్తి చేసి రాజమౌళి చిత్రంతో రాంచరణ్, ఎన్టీఆర్ బిజీ కాబోతున్నారు.