‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 2’ హడావుడి మొదలైంది, సామాన్యులకూ ఛాన్స్!

Filmibeat Telugu 2018-05-14

Views 491

బిగ్ బాస్ తెలుగు గతేడాది ప్రారంభం అవ్వగా ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ షోను హోస్ట్ చేయడంతో టీఆర్పీ రేటింగ్స్ ఆకాశాన్నంటాయి. తెలుగు టీవీ రంగంలో ఇప్పటి వరకు ఏ షోకు రానంత రేటింగ్స్ సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్లో 14 మంది సెలబ్రిటీలు హౌస్‌లో ఎంటరై గేమ్‌లో భాగం కాగా, గ్రాండ్ ఫినాలెలో నటుడు శివ బాలాజీ విజేతగా నిలిచాడు. మరికొన్ని రోజుల్లో సీజన్ 2 మొదలు కాబోతోంది. తాజాగా స్టార్‌మా టీవీ వారు బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 అఫీషియల్ లోగో విడుదల చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS