Ram Charan Talks About Industry Culture

Filmibeat Telugu 2018-05-11

Views 1

In Rajeev Masand Interview Telugu star Ram Charan talks about the success of his latest film Rangasthalam and how it’s liberated him to make the movies he believes in, his father - the legendary superstar Chiranjeevi - and what he’s learnt about career longevity from him, and that film he’s making with SS Rajamouli that also stars Jr NTR
#RamCharan
#Rangasthalam


రంగస్థలం' సినిమా భారీ విజయం సాధించడం, రూ. 200 కోట్ల మార్కును సైతం అందుకోవడంతో బాలీవుడ్ క్రిటిక్స్ దృష్టి కూడా ఇటువైపు మళ్లింది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు రాజీవ్ మసంద్ చెర్రీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.
రంగస్థలం మూవీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో చిట్టి బాబు పాత్ర చేయడం వల్ల వ్యక్తిగతం కూడా నాలో మార్పు వచ్చిందని నా భార్యతో పాటు చాలా మంది చెబుతున్నారు. రంగస్థలం సినిమా సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ షూటింగ్ నిమిత్తం 5 రోజుల పాటు ఒక రిమోట్ విలేజ్‌లో పని చేశాం. అక్కడ ఎక్కువగా ఆదివాసీలు ఉన్నారు. వారిని దగ్గరగా గమనించడం వల్ల మరింత బాగా నటించగలిగాను.... అని రామ్ చరణ్ తెలిపారు.
హాలీవుడ్ పవర్ ఫుల్, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ హార్వీ వెయిన్‌స్టన్ సెక్సువల్‌గా నటీమణులను హరాస్‌చేస్తున్న బయట పడింది. ఈ కల్చర్, సెక్సిజం ప్రపంచమంతా ఉంది, అదే విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉంది. ఈ విషయమై టాలీవుడ్లో శ్రీరెడ్డి కూడా ఆందోళన చేపట్టింది. మీ అంకుల్ పవన్ కళ్యాణ్ మీద కొన్ని కామెంట్లు కూడా చేసింది దీనిపై మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయమై రామ్ చరణ్ స్పందించారు. నేను ప్రత్యేకంగా ఆమె గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఇలాంటివి అన్ని చోట్లా, అన్ని ఇండస్ట్రీల్లో ఉంటున్నాయి. పాలిటిక్స్, బిజినెస్‌లోకూడా చూశాం. ఇలాంటివి ఎవరూ ఎంకరేజ్ చేయ కూడదు. నా సిస్టర్స్ కూడా ఈ రంగంలో ఉన్నారు. ఇండస్ట్రీలో అంతా ఇలా ఉందని అనడం సరికాదు. కొంత వరకు ఇలాంటివి జరుగుతుండవచ్చు. దీనిపై ‘మా' కమిటీ వేసి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అదే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఇండస్ట్రీలో నా సిస్టర్స్ కూడా పని చేస్తున్నారు. ఇండస్ట్రీ సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను, తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించాలి అని రామ్ చరణ్ అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS